రాజ్యాంగ విలువలతోనే దేశాభివృద్ధి : శ్రీసామల కిరణ్

by Elthuri vijay kumar |

రాజ్యాంగ విలువలతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని శ్రీ సామల కిరణ్ కరీంనగర్ భౌద్ధిక్ ప్రముఖ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ మంథని శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ లో విజయదశమి ఉత్సవం జరిగింది.

రాజ్యాంగ విలువలతోనే దేశాభివృద్ధి : శ్రీసామల కిరణ్
X

రాజ్యాంగ విలువలతోనే దేశాభివృద్ధి : శ్రీసామల కిరణ్

ఆర్ఎస్ఎస్ దేశ అభ్యున్నతి కొరకు పనిచేస్తుంది

: మంథని ఆర్డీఓ కాశబోయిన సురేష్

దిశ, మంథని : రాజ్యాంగ విలువలతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని శ్రీ సామల కిరణ్ కరీంనగర్ భౌద్ధిక్ ప్రముఖ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ఎస్ఎస్ మంథని శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కాశబోయిన సురేష్ పాల్గొని మాట్లాడుతూ.. ఆర్ ఎస్ ఎస్ వందేళ్లుగా రాజ్యాంగ బద్దంగా ఈ దేశ అభ్యున్నతి కొరకు పనిచేస్తుందని చెప్పారు. ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు ఆర్ ఎస్ ఎస్ చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ ఎస్ ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు.ప్రధాన వక్త శ్రీ సామల కిరణ్ ఆర్ఎస్ఎస్ విభాగ్ భౌద్ధిక్ ప్రముఖ్ మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు, హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు.దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని కండ కార్యవాహ గర్రెపెల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Next Story