ఇరుకైన రోడ్డు.. అంబులెన్స్‌కు దారి లేక ఇబ్బందులు

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి కొండాపూర్ గ్రామానికి వెళ్లే ఈ రహదారి పరిస్థితి దారుణంగా మారింది.

ఇరుకైన రోడ్డు.. అంబులెన్స్‌కు దారి లేక ఇబ్బందులు
X

దిశ, మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి కొండాపూర్ గ్రామానికి వెళ్లే ఈ రహదారి పరిస్థితి దారుణంగా మారింది. రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా.. రోడ్డు మాత్రం ఇరుకుగానే ఉండిపోయింది. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లకు కూడా ఇక్కడ ప్రయాణం కష్టసాధ్యంగా మారుతోంది. మంగళవారం అత్యవసర పరిస్థితిలో ఓ పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. కాచారం గ్రామానికి చెందిన వ్యక్తి చెట్టుపై నుంచి పడిపోవడంతో అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌కు దారి లేక నిలిచిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన దిశ రిపోర్టర్ స్వయంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు మార్గం కల్పించడం జరిగింది. ఈ ఘటనతో సమస్య తీవ్రత స్పష్టమవుతోంది. కాగా ఈ రహదారి మీద ప్రయాణించే ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన రోడ్డు కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story