సింగరేణి అధికారిణికి నారి శ్రమ శక్తి అవార్డు

by Ratna Kumari |

సింగరేణిలో విశేష కృషి చేసిన అల్లం నవ్య శ్రీ కి నారి శ్రమ శక్తి అవార్డు ల‌భించింది.

సింగరేణి అధికారిణికి నారి శ్రమ శక్తి అవార్డు
X

దిశ, గోదావరిఖని : సింగరేణిలో విశేష కృషి చేసిన అల్లం నవ్య శ్రీ కి నారి శ్రమ శక్తి అవార్డు ల‌భించింది. జీడీకే 11 గనిలో విధులు నిర్వహిస్తూ.. విశేష కృషి చేసిన అల్లం నవ్య శ్రీ, నారి శ్రమ శక్తి అవార్డును కలకత్తాలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నారి శ్రమ శక్తి అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్బంగా ఆర్జీ 1 జియం లలిత్ కుమార్ అల్లం నవ్య శ్రీకి అభినందనలు తెలియజేశారు. నవ్యశ్రీ గ్రాడ్యుయేట్ మైనింగ్ ఇంజనీర్ (E3) పదవిలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ కలిగి, రెస్క్యూ శిక్షణ కూడా పొంది అవసరమైనప్పుడల్లా ఉత్పత్తి షిఫ్ట్ కోసం కంటిన్యుస్ మైనర్ విభాగం మొదటి షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గని స్ట్రాటా కంట్రోల్ ఆఫీసర్‌కు విశ్వసనీయంగా వ్యవహరించడం, సాధారణ షిఫ్ట్ పనిలో ప్యానెల్ ఇన్‌చార్జ్, నిరంతర మైనర్ విభాగానికి సహాయం చేయడం, జనరల్ షిప్ట్ సూపర్ వైజర్లు, టెక్నీషియన్లు ఇతర ఉద్యోగులతో సహా సుమారు 200 మంది కార్మికులతో విధులు నిర్వహిస్తున్నారు. షిఫ్ట్ ఆపరేషన్లలో, ప్రతి షిఫ్ట్‌లో దాదాపు 300 టన్స్ ఉత్పత్తిలో సుమారు 40 మంది వ్యక్తుల ప్రత్యక్ష పర్యవేక్షణ, భూగర్భంలో పని చేయడం పురుషులతో పాటు యంత్రాలు, భద్రత, స్ట్రాటా పర్యవేక్షణ, ఉత్పత్తి, ఉత్పాదకత, గ్యాస్ డిటెక్షన్ మొదలైన వాటిని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు ఉద్యోగులు, అధికారులు అభినందనలు తెలిపారు.

Next Story