- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు అన్నం పెడుతలే సారూ..!
కొడుకు కోడలు పట్టించుకుంటలేరు బాంచను.. ఊరికి దూరమైతున్నం.. కాటికి దగ్గరైతున్నం ఉన్నన్ని రోజులు బుక్కెడు బువ్వ పెట్టేటట్టు చూడుర్రి సారు.. అంటూ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

కొడుకు అన్నం పెడుతలే సారూ..!
- కాటికి దగ్గరవుతున్నాం.. ఉన్నన్ని రోజులు బుక్కెడు బువ్వ పెట్టేలా చూడుర్రి సారూ..
- పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన వృద్ధ దంపతులు
దిశ, జగిత్యాల రూరల్: కొడుకు కోడలు పట్టించుకుంటలేరు బాంచను.. ఊరికి దూరమైతున్నం.. కాటికి దగ్గరైతున్నం ఉన్నన్ని రోజులు బుక్కెడు బువ్వ పెట్టేటట్టు చూడుర్రి సారు.. అంటూ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య అనే వృద్ధుడు భార్యతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆరు ఎకరాల భూమి సంపాదించి ఇస్తే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ వృద్ధ దంపతులు వాపోయారు. ఉన్న ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు గతంలోనే చనిపోగా పెద్ద కొడుకు పట్టించుకోవడంలేదని చిన్న కోడలు తమ మొహం కూడా చూడడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. రెండు నెలలుగా అన్నం పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బుక్కెడు బువ్వ పెట్టేలా చూడండి సారు.. అంటూ పోలీసులను కోరారు. కాగా స్పందించిన పోలీసులు కొడుకు కోడలును పిలిపించి మాట్లాడతామని హామీ ఇచ్చారు.






