ముస్లిం మహిళ రాముల వారికి పట్టు వస్త్రాల సమర్పణ

by Nallavelli.Anjaneyulu |

అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ ముస్లిం మహిళ అబిదా భాను పట్టు వస్త్రాలు, త‌లంబ్రాలు సమర్పించారు.

ముస్లిం మహిళ రాముల వారికి పట్టు వస్త్రాల సమర్పణ
X

దిశ, జమ్మికుంట : అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ ముస్లిం మహిళ అబిదా భాను పట్టు వస్త్రాలు, త‌లంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అబీద భాను మాట్లాడుతూ తాను స్వయంగా తయారు చేసినటువంటి పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించాన‌ని.. ఇక‌ నుండి ప్రతి సంవత్సరం స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పిస్తానని తెలిపారు. ముస్లిం మహిళ భాను రాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story