- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో కోతులు.. వనం విడిచి జనంలోకి వస్తున్న వానరాలు
అడవుల్లో , గుట్టల్లో జీవించాల్సిన కోతులు అడవులు ద్వంసం కావడంతో వనం వీడి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం కోతులు చేస్తున్న అలజడితో జనం బేంబేలెత్తుతున్నారు. గుంపులు గుంపులుగా గ్రామంలోకి చొరబడుతున్న కోతులు పంట చేళ్లను పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.

దిశ, చొప్పదండి : అడవుల్లో , గుట్టల్లో జీవించాల్సిన కోతులు అడవులు ద్వంసం కావడంతో వనం వీడి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం కోతులు చేస్తున్న అలజడితో జనం బేంబేలెత్తుతున్నారు. గుంపులు గుంపులుగా గ్రామంలోకి చొరబడుతున్న కోతులు పంట చేళ్లను పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇండ్లలో పండ్ల చెట్లు ఉంటే చాలు అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పండ్ల చెట్లపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన అవి చెట్లపై ఉన్నప్పుడు అక్కడ తారసపడ్డా మనుషులను సైతం దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి గ్రామాల్లో కోతుల బెడద తీవ్రం కావడంతో కోతులను అరికట్టేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా డబ్బు పోగేసుకుని వాటిని తరలించే దుకు ఏర్పాట్లు చేసుకుంటూ కోతుల నుంచి కాపాడాలంటూ అధికారులను వేడుకుంటున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలవరం రేపుతుంది
వనాలు ధ్వంసంతో గ్రామాల్లోకి కోతులు
అడవులు ధ్వంసం కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. చొప్పదండి మండలం ఆర్నకోండలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైంది. కోతులు ఇళ్లలోకి చోరబడి జనాన్ని గాయపరుస్తుండటంతో కోతులు గ్రామంలోకి వచ్చాయంటే తలుపు గడియలు పెట్టుకుని అవి గ్రామాన్ని వదిలివెల్లే వరకు ఇంటిలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. వాటి ప్రభావం ప్రభుత్వ పాఠశాలలకు సైతం తప్పడం లేదు. ఆర్నకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి కోతులు దూరడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. దీంతో కోతులు రాకుండా ఉండాలి అంటే చెట్లను నరికివేస్తే కోతులు పాఠశాల ప్రాంగణం లోకి రావు అని స్కూల్ ఆవరణలోని చెట్లు నరికివేశారు అంటే అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉందో అర్థం అవుతుంది.
సమస్య తగ్గాలంటే..
కోతులు గ్రామాల్లోకి రాకుండా అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ కమిటీ ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, హరితహారంలో పండ్ల మొక్కలు నాటడం. ఇందులోని ప్రధాన సూచనలు.అడవుల్లో పండ్ల మొక్కలు నాటడమే పరిష్కారంగా భావిస్తున్నారు. గతంలో అడవుల్లో అనేక రకాల పండ్ల చెట్లుండేవి. వాటిని తింటూ అక్కడే ఉండేవి. ఒక మర్రిచెట్టుపై వెయ్యి కోతులు నిద్రపోతాయి. ఇప్పుడు అక్కడ పండ్ల చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఆహార, ఆవాస సమస్యలతో జనావాసాల్లోకి వస్తున్నాయి. సమస్య నివారణకు అడవుల్లో పెద్దసంఖ్యలో పండ్ల మొక్కలు నాటాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
చింతవృక్షం.. నేలమట్టం
ఆర్నకోండ గ్రామం మధ్యలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలలోని భారీ చింతవృక్షంపై వందలాది కోతులు తీష్ట వేసి విద్యార్థులను గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ఏళ్ల చరిత్ర కలిగిన భారీ చింతవృక్షాన్ని పాఠశాల యావజమాన్యం కొట్టేసి వేసవిలో పిల్లలకు నీడ లేకుండా చేశారు.
ఆర్నకొండలో గ్రామస్తుల తీర్మానం
కోతుల బాధ భరించలేని ఆర్నకొండ గ్రామస్తులంతా శనివారం ఏకమై ఒక నిర్ణయం తీసుకున్నారు. కోతులను పట్టి 100 కిలోమీటర్ల దూరంలో విడిచి పెట్టేందుకు గ్రామస్తులంతా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో కోతికి సుమారు 300 ధరను నిర్ణయించారు. కోతులను పట్టేందుకు భయానగా 5000 రూపాయలు గ్రామస్తులంతా ఏకమై కోతులు పట్టే వారికి చెల్లించారు. కోతుల బెడద విషయంలో అధికారులు స్పందించి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని ఆదిత్య యూత్ క్లబ్ సభ్యులు కోరుతున్నారు.






