- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ లో కోతుల బీభత్సం..ఉపాధ్యాయుడిపై దాడి
by velandi.Saikiran |
హుజురాబాద్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఇమ్మడి సంపత్ కుమార్ పై కోతులు దాడి చేశాయి

X
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ లో కోతుల దాడుల పరంపర కొనసాగుతోంది. హుజురాబాద్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయులు ఇమ్మడి సంపత్ కుమార్ పై కోతులు దాడి చేశాయి. సంపత్ కుమార్ దివ్యాంగుడైనప్పటికీ, విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేసారు. దీన్త ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి సంపత్ కుమార్ నడవడానికి కర్ర సహాయం తీసుకుంటారు. అయితే తాజాగా పాఠశాల ఆవరణలో ఉన్న విద్యార్థులపై కోతులు ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన సంపత్ కుమార్, తన ప్రాణాలను ఫణంగా పెట్టి, చేతిలో ఉన్న కర్రతో వాటిని అడ్డుకున్నారు. దీంతో కోతుల గుంపు మొత్తం ఆయనపై దడి చేశాయి. ఈ దాడిలో సంపత్ కుమార్ చేతులకు, శరీరంపై గాయాలయ్యాయి.. అనంతరం సంపత్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు.
Next Story






