- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థినుల ఎంపిక!
కబడ్డీ అసోసియేషన్ 85వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట్ మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల) విద్యార్థినులు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థినుల ఎంపిక!
దిశ, ఇల్లంతకుంట : కబడ్డీ అసోసియేషన్ 85వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట్ మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల) విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలికల విభాగంలో పదో తరగతి విద్యార్థినులు కే.శ్రీనిజ (వల్లంపట్ల), ఎం.నిత్య(సోమారంపేట), పి.వైష్ణవి(సిరికొండ) ఎంపికైనట్టు వారు తెలిపారు. ఈనెల 18న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో వీరు అత్యంత ప్రతిభ కనబరిచి ఈనెల 25 నుండి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ గాదె పద్మ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.






