MLA Sanjay Kumar: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

by Chintha Aamani |

జగిత్యాల నియోజకవర్గం లో పలు వైద్య సేవలను

MLA Sanjay Kumar: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల నియోజకవర్గం లో పలు వైద్య సేవలను అభివృద్ధిపరచలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం లో 33 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, 20 ఆరోగ్య ఉప కేంద్రాలలోని భవనాలకు నిధులు కూడా మంజూరు కాగా భవన నిర్మాణాలు త్వరగా చేపట్టాలని, పంచాయతీ అధికారులతో ఫోన్లో మాట్లాడి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

అలాగే రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సైతం ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని జిల్లా వైద్య అధికారులతో తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ సమీయుద్దీన్, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story