- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరం
సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో

దిశ, జగిత్యాల టౌన్: సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లాకు చెందిన 64 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 16 లక్షల 82 వేలు, 89 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. 89 లక్షలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
అలాగే ఏకకాలంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్, కుల గణన, రైతులకు రుణమాఫీ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరమని అన్నారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులకు జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఎమ్మార్వో రామ్మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, రాములు, గోలి శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






