చిలక వాగు ప్రక్షాళన పై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

by Batti.Sumithra |

జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్న చిలక వాగు వర్షాకాలంలో వరదనీటితో నిండిపోతూ, మిగతా కాలంలో మురికి కాలువలా మారిపోతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది.

చిలక వాగు ప్రక్షాళన పై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
X

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలో ఉన్న చిలక వాగు వర్షాకాలంలో వరదనీటితో నిండిపోతూ, మిగతా కాలంలో మురికి కాలువలా మారిపోతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసెంబ్లీలో చిలక వాగు ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ పై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. చిలక వాగు శుభ్రత, నీటి ప్రవాహం మెరుగుదల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వాకింగ్ ట్రాక్, లైటింగ్, పచ్చదనం వంటి సౌకర్యాలతో వాగు పరిసరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే కాకుండా, పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని వివరించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఎమ్మెల్యేకు సర్పంచ్ జీవన్ రెడ్డి, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిలక వాగు, బస్ స్టాండ్ పునరుద్ధరణ వల్ల గ్రామానికి కొత్త ఊపిరి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమం త్వరితగతిన అమలవుతుందని, ప్రజల సహకారంతో చిలక వాగు తిరిగి జీవం పొందుతుందని ఆశిద్దాం.

Next Story