- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలుక వాగు ప్రక్షాళన.. మోడల్ బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముందడుగు
కొడిమ్యాల పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రామసర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి కలిసి చేస్తున్న కృషి ప్రజలకు ఆశాజనకంగా మారింది.

X
దిశ, కొడిమ్యాల : కొడిమ్యాల పట్టణ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రామసర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి కలిసి చేస్తున్న కృషి ప్రజలకు ఆశాజనకంగా మారింది. పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న చిలుకవాగు ప్రక్షాళన కోసం 4 కోట్ల రూపాయల నిధులు, అలాగే ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం మోడల్ బస్ స్టాండ్ నిర్మాణంకి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని వారు సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దనసరి అనసూర్య ( సీతక్క) లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు నిధుల కేటాయింపు పై స్పష్టమైన హామీ ఇచ్చారని సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల అమలుకు నిధుల మంజూరు కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సర్పంచ్ కృతఙ్ఞతలు తెలియచేశారు.
Next Story






