రంగపేటలో పశువుల వారసంత ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

by Ratna Kumari |

గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే దిశగా వారసంతల నిర్వహణ కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

రంగపేటలో పశువుల వారసంత ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
X

దిశ, మానకొండూరు : గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే దిశగా వారసంతల నిర్వహణ కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామంలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పశువుల వారసంతను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్పంచులు వారసంతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులు, పశుపోషకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వారసంతల వల్ల అమ్మకందారులు, కొనుగోలుదారులకు పరస్పర లాభం చేకూరుతుందని వారు తెలిపారు. సమ్మక్క–సారళమ్మ జాతర నేపథ్యంలో తొలి రోజే సుమారు 100 మేకలు, గొర్రెలు అమ్ముడుపోవడం విశేషం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మర్రి ఓదెలు యాదవ్, కాంగ్రేస్ పార్టీ మానకొండూరు మండలధ్యక్షులు రవీంద్ర చారి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుమల్ రెడ్డి,రంగపేట కాంగ్రేస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మారెళ్ల నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ ఉపసర్పంచ్ ల ఫోరం సంఘం అధ్యక్షులు రేమిడి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story