- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో కౌశిక్ రెడ్డి.. రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
by velandi.Saikiran |
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మతిభ్రమించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు

X
దిశ, వీణవంక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మతిభ్రమించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నర్సింగాపూర్ గ్రామంలో కవ్వంపల్లి మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో ఎదుటి పార్టీ వైఫల్యాలపై మాట్లాడి ఓట్లు అడగాలి తప్ప, వ్యక్తిగతంగా దూషించడం సబబు కాదన్నారు. నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డిని ఉద్దేశించి, నీ అంతు చూస్తానని బెదిరించడం దారుణమని ఫైర్ అయ్యారు. హత్యలకు పాల్పడేవాళ్ళను పక్కన పెట్టుకొని అంతు చూస్తానని ధైర్యంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడాలి కానీ, ఇలా మాట్లాడితే ప్రజలు నీ అంత చూస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.
Next Story






