- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి అదృశ్యం.. కేసు నమోదు
యువతి అదృశ్యమైన సంఘటన జూలపల్లి మండలం వాడ్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, సుల్తానాబాద్ : యువతి అదృశ్యమైన సంఘటన జూలపల్లి మండలం వాడ్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరి కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా పూసల గ్రామం వద్ద ఉంటున్నారని.. అమ్మాయికి గత ఆరేళ్లుగా మతిస్తిమితం సరిగ్గా ఉండటం లేదని తెలిపారు. గురువారం 9 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చుట్టు పక్కల వెతికి అమ్మాయి ఆచూకి కనిపించకపోవడంతో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అమ్మాయి తల్లి జెట్టి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్ననట్టు తెలిపారు. ఆచూకి తెలిసిన వారు సుల్తానాబాద్ సీఐ 8712656510, ఎస్సై 8712656511 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Next Story






