- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు సిరిసిల్లలో మంత్రుల పర్యటన
by Ratna Kumari |
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిరిసిల్లలో బుధవారం పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.

X
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిరిసిల్లలో బుధవారం పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ధర్మపురి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ కి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్లకి రానున్నారు. అనంతరం సిరిసిల్లలో యూఐడీఎఫ్ కింద రూ.18 కోట్ల 50 లక్షల నిధులతో ఆరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు వ్యవసాయ యంత్రాల పంపిణీ తదానంతరం ఏర్పాటుచేసిన ఇరువురు మంత్రులు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. సాయంత్రం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు శివారులో కేజీబీవీ అదనపు భవనాన్ని ప్రారంభించి, నాబార్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన అదనపు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కరీంనగర్ కు మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళనున్నారు.
Next Story






