- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టపోయిన రైతులకు పరిహారం - మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, మంథని : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మంథని పట్టణంలోని రావుల చెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమములో ఆయన పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని గణేష్ హోమంలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటాం అన్నారు.
మంథని మున్సిపాలిటీలో సిడిపి రూ.48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. 1 కోటి 20 లక్షలు విలువచేసే మంథని మండలం 84 కల్యాణ లక్ష్మి చెక్కులతోపాటు, మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాలకు చెందిన 101 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అటు మంథని మున్సిపల్ పరిధిలోని గణపతి మండపాలను మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న,ఆయా మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






