- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
ఒక్కసారి మాట ఇస్తే... మడమ తిప్పని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం

దిశ, మంథని : ఒక్కసారి మాట ఇస్తే... మడమ తిప్పని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు మాజీ స్పీకర్ శ్రీపాద రావు విగ్రహనికి పూల మాల వేసి క్షిరాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ భవనం కొరకు కోటి రూపాయల నిధులను మంజూరు చేసినందుకు మంత్రి శ్రీధర్ బాబు కు దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏప్రిల్ 14న మంథనిలో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అంబేద్కర్ భవనం కోసం 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులు సరిపోవని మంత్రిని దళిత సంఘాల నాయకులు కోరగా.. అంబేద్కర్ భవనం కోరకు 1 కోటి రూపాయల నిధుల మంజూరు చేస్తానని గతంలో మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 1కోటి రూపాయలు నిధులను మంజూరు చేసి చూపించారు. దీంతో మంత్రి శ్రీ ధర్ బాబుకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,మంథని ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి సభ్యులు సింగారపు కిష్టయ్య, సీనియర్ నాయకులు నూకల బానయ్య, తదితరులు పాల్గొన్నారు.






