Medaram Jatara 2026 : మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

by velandi.Saikiran |   (  Updated:2026-01-28 11:09:01  IST  )

మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు.

Medaram Jatara 2026 : మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
X

దిశ, మంథని: మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. బుధవారం మంథని పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమం ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథని ఆర్యవైశ్య సంఘ సోదరులు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు.మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా బస్సులను అందుబాటులో ఉంచాలని డిపో మేనేజర్ కు తెలిపారు.బస్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు గురించి తెలుసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, ప్రయాణికులు, మేడారం కు వెళ్లే భక్తులు ఉన్నారు.

Next Story