- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ పర్యటనలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
వేములవాడ పర్యటనలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

దిశ, వేములవాడ: వేములవాడ పర్యటనలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని సమ్మక్క సారక్క ఆలయంతో పాటు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న మంత్రి స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మక్క సారక్క, రాజన్న ఆలయాలతో పాటు ఏ ఒక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య భక్తుల మనోభావాలను గుర్తించి ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో...?
ఓవైపు మేడారం జాతర జరుగుతుంటే మరోవైపు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈనెల 18న క్యాబినెట్ మీటింగ్ సైతం మేడారంలో ఏర్పాటు చేసుకున్నామని, 19న పునర్నిర్మాణమైన సమ్మక్క సారలమ్మ ఆలయం ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ జాతరకు భక్తులకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ పట్టుదలతో ఉన్నారని, ఆయన నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాజన్న ఆలయం రూపురేఖలు మారి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆర్డీఓ రాధా భాయి, ఆలయ ఈ.వో రమాదేవి, ఏ.ఎస్పీ రుత్విక్ సాయి, పట్టణ సీఐ వీర ప్రసాద్, ఆర్.ఎస్సైలు రాజు, శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.






