- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రైతు భరోసా విడుదల కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, మంథని: రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం.పాలకుర్తి మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సోమవారం కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రైతు భరోసా విడుదల కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనమల రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో, ఐటి మంత్రి శ్రీధర్ బాబు, మంత్రివర్గ సహచరులు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరవ్వాలి..
ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సోమవారం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. అలాగే కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు కేటాయించి, ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం పాలకుర్తి మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






