- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్థరాత్రి కొండ చిలువ కలకలం
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఆదివారం అర్థరాత్రి కొండ చిలువ కనిపించడంతో అలజడి రేగింది.

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఆదివారం అర్థరాత్రి కొండ చిలువ కనిపించడంతో అలజడి రేగింది. కళాశాల పక్కన ఉన్న పొదల్లో జంతువు కదలికలు గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూసేసరికి పెద్ద కొండ చిలువ కదులుతూ కనిపించింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వెంటనే కొంతమంది స్థానికులు ధైర్యంగా వ్యవహరించి, చిలువను పట్టుకొని సురక్షితంగా పట్టణానికి బయటగల గుట్టల్లో వదిలేశారు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కళాశాల చుట్టుపక్కల పెరిగిపోయిన ముళ్ళకంపలు, పొదలు, చెట్లమేడలు పాములు, ఇతర క్రూర జంతువులకు ఆవాసంగా మారుతున్నాయి. తరచూ పాము వంటి సర్పాలు కళాశాల సమీపంలో కనిపించడం వల్ల విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కళాశాల చుట్టుపక్కల ఉన్న చెట్లు, పొదలను తొలగించి, శుభ్రం చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అలాగే కళాశాల సరిహద్దులకు గోడలూ, తారక పంచ్ వలయాలూ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






