- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడలతో యువతలో మానసికోల్లాసం: పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి
క్రీడలతో యువతలో మానసికోల్లాసం పెంపొందుతోందని పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు.

దిశ, వెల్గటూర్: క్రీడలతో యువతలో మానసికోల్లాసం పెంపొందుతోందని పీఏసీఎస్ డైరెక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎండపల్లి మండల పరిధిలోని పడ్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారులకు ఆయన జెర్సీలు పంపిణీ చేశారు. పీఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ కు చేరిన పడ్కల్ పీఎస్అర్ జట్టు సభ్యులకు క్రీడా దుస్తులను అందజేసి వారిలో నూతనోత్సహాన్ని నింపారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు సూచించారు. ఓటమితో కుంగిపోకుండా ఆ ఫలితాన్నే గెలుపుకు నాందిగా భావించాలన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ పట్టుదలతో బరిలో దిగి ఆడితే విజయం తప్పకుండా వరిస్తుందని పీఏసీఎస్ డైరెక్టర్ జిరెడ్డి మహేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ కంది విష్ణు, కొప్పుల సురేష్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.






