- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపంకం ఎఫెక్ట్.. కూలిన ఇంటి పైకప్పు.. పరుగులు తీసిన యజమాని...
by Bhanu |
సోమవారం బీమారం మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూమి స్వల్పంగా కంపించడంతో పల్లి అర్జున్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు కుప్పకూలింది.

X
దిశ, మేడిపల్లి: సోమవారం బీమారం మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూమి స్వల్పంగా కంపించడంతో పల్లి అర్జున్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు కుప్పకూలింది. భూమి కదులుతున్నట్లు గుర్తించిన వెంటనే ఇంట్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. భూకంపం ప్రభావం తగ్గిన వెంటనే, మేడిపల్లి, బీమారం మండలాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటికే కళ్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోకుండా రైతులు నానా తంటాలు పడ్డారు. ఇదిలా ఉండగా, మొన్నటి గాలికి రాలిపోయిన మామిడి కాయలతో నష్టపోయిన రైతులు, ఈ తాజా విపత్తుతో మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Next Story






