కొత్తగట్టు శివారులో భారీ చోరీ

by Ratna Kumari |   (  Updated:2026-03-05 14:42:00  IST  )

శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో కాకతీయ కాలువకు అమర్చుకున్న 13 మంది రైతులకు చెందిన 15 వ్యవసాయ పంపు సెట్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలో కలకలం రేపుతుంది.

కొత్తగట్టు శివారులో భారీ చోరీ
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో కాకతీయ కాలువకు అమర్చుకున్న 13 మంది రైతులకు చెందిన 15 వ్యవసాయ పంపు సెట్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలో కలకలం రేపుతుంది. రైతులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన అజ్జల రవీందర్ రెడ్డి, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, కొప్పురపు కొండాల్ రెడ్డి, అజ్జల మల్లారెడ్డి (2), కొంపెల్లి గోపాల్ రెడ్డి, సారా బుడ్ల లింగారెడ్డి, ఇజిగిరి సుధాకర్, పోల్సాని శ్రీనివాస్ రెడ్డి, మందాడి భగవాన్ రెడ్డి, ఇజగిరి వెంకటయ్య, కేశిరెడ్డి వెంకట్రెడ్డి ,కొంపల్లి మోహన్ రెడ్డి(2), ఎండి అంజాద్ అనే రైతులు పంట పొలాలకు నీరు అందించడం కోసం కాకతీయ కాల్వకు ,విద్యుత్ పంపు సెట్లను అమర్చుకున్నట్లు తెలిపారు.బుధవారం రాత్రి వరకు వ్యవసాయ మోటార్లు ఉన్నాయని గురువారం ఉదయం వెళ్లి చూడగా రైతుల మోటార్లు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. ఒకేసారి 15 మోటార్లను ఎత్తుకెళ్లడం మండలంలో సంచలనం రేపుతుంది.ఎత్తుకెళ్లిన మోటార్ల విలువ దాదాపు 75 వేల వరకు ఉంటుందని అన్నారు. దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతులు కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story