Breaking News: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

by Yella Dhawani Reddy |

Breaking News: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, కరీంనగర్ సిటీ: నగర శివారులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బైపాస్ రోడ్ సమీపంలోని ఆయిల్ గోదాంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిల్వచేసిన లక్షలాది రూపాయలు విలువ చేసే వంట నూనె బుగ్గి పాలైంది. నూనె కాటన్లు అంటుకుని అగ్ని కీలలు ఉవ్వెత్తుకు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన పరిసర భవనాల వాచ్‌మెన్‌లు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని, ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకున్నది. బైపాస్ రోడ్డుకుండా నిమిషానికి పదుల సంఖ్యలో వెళ్లే వాహనాలు, అగ్ని ప్రమాదం మూలంగా ఎక్కడికక్కడే నిలిచి పోగా, ట్రాఫిక్ స్తంభించింది.

Next Story