- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితపై ముగ్గురు అత్యాచారం..మత్తు మందు ఇచ్చి మరీ !
వివాహిత మహిళకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, రామడుగు : రాత్రిపూట నిద్రిస్తున్న ఓ వివాహిత మహిళకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలలోకి వెళితే, రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన ఓ వివాహిత, తన తల్లి ఇంట్లోనే జీవనం కొనసాగిస్తోంది. కాగా ఈ నెల 16న తన తల్లి ఇంటి బయట బాధిత వివాహిత, తన కూతురుతో కలిసి నిద్రించారు. ఆ సమయంలో ఇదే గ్రామానికి చెందిన అహ్మద్, వంచ సత్యనారాయణతో పాటు మరో వ్యక్తి కలిసి ఆ వివాహితకు మత్తు ఇంజక్షన్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇక ఈ సంఘటనపై ఈ నెల 18న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.
వివాహితపై ముగ్గురు అత్యాచారం
కానీ ఈ సంఘటనపై పోలీసులు పట్టనట్టే వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటన మానవ హక్కుల సంఘం దాకా వెళ్లింది. అటు ఈ దారుణంపై సఖీ సెంటర్ కు సమాచారం అందించారు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు. ఈ తరుణంలోనే స్థానిక జిల్లా టూ టౌన్ పోలీసు స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధితురాలు తెలిపింది. పేద కుటుంబంలో పుట్టిన తనకు ఆసరాగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ, పట్టించుకోలేదని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






