తెలంగాణ జాగృతిలో ప‌లువురి చేరిక

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన జాగృతి నాయకులు కూర సురేష్ పటేల్ ఆధ్వ‌ర్యంలో దాదాపు 40 మంది అనుచరులతో కలిసి ఆదివారం కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.

తెలంగాణ జాగృతిలో ప‌లువురి చేరిక
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన జాగృతి నాయకులు కూర సురేష్ పటేల్ ఆధ్వ‌ర్యంలో దాదాపు 40 మంది అనుచరులతో కలిసి ఆదివారం కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. గంభీరావుపేట మండలం నుంచి భారీగా తరలివచ్చిన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కూర సురేష్ మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సంఘటితం కావాలని అన్నారు. తెలంగాణ జాగృతి వేదికగా నియోజకవర్గ సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, జాగృతి నాయకులు ఎర్ర నర్సయ్య, రంగారావు, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story