గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 1 |
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ, మానకొండూర్: మండల కేంద్రంలోని చెరువు కట్ట సమీపంలో గంజాయిని అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. దొరికిన గంజాయి తూకం వేయగా ఒక కిలో వంద గ్రాములు ఉన్నట్లుగా తహసీల్దార్ లక్ష్మారెడ్డి తెలిపారు. గంజాయి ప్యాకెట్లతో పట్టుబడిన వ్యక్తి వరంగల్ జిల్లా గిర్మాజీ పేట గ్రామానికి చెందిన కొప్పిసెట్టి జగదీశ్ గా గుర్తించారు. సోమవారం మానకొండూర్ చెరువు కట్ట సమీపంలో గంజాయి ప్యాకెట్లను ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రోడ్డుపై వెళ్లే దినసరి కూలీలకు అమ్మేందుకు ప్రయత్నించగా మానకొండూర్ పోలీసులు పక్క సమాచారంతో అతని రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు మానకొండూర్ సీఐ మాదాస్ రాజు కుమార్ తెలిపారు.


Next Story

Most Viewed