- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదకరంగా బావి..వ్యక్తి మృతి
మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న బావిలో పడి వ్యక్తి మృతి సంఘటన మానకొండూరు మండలంలో జరిగింది. వివరాల్లోకి వె

దిశ, మానకొండూరు: మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న బావిలో పడి వ్యక్తి మృతి సంఘటన మానకొండూరు మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... లింగాపూర్ గ్రామానికి చెందిన గాలిపల్లి ఆంజనేయులు (41) జగ్గయ్యపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఆగస్టు 26, 2025న ఈ సంఘటన జరిగింది. ఆంజనేయులు కరీంనగర్ ఆసుపత్రిలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 26న రాత్రి కర్నూలులో ఉన్న తన భార్య పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేయగా చూసేందుకు బయలుదేరాడు.
ఇక ఆగస్టు 28న జగ్గయ్యపల్లిలోని రోడ్డుపక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయగా అది ఆంజనేయులుదిగా గుర్తించారు. ఆంజనేయులు తన బైక్‌తో సహా బావిలో పడి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబ సబ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక ఆంజనేయులు మృతికి కారణమైన బావి యజమాని కరుణాకర్, ఆర్‌అండ్‌బి రోడ్డు సంస్థ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






