బైకు ఢీకొని వ్యక్తి మృతి..శంకరపట్నంలో విషాదం

by Bhanu |   (  Updated:2025-06-13 11:02:29  IST  )

ఓ ద్విచక్ర వాహనం మరొక ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.

బైకు ఢీకొని వ్యక్తి మృతి..శంకరపట్నంలో విషాదం
X

దిశ, శంకరపట్నం : ఓ ద్విచక్ర వాహనం మరొక ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో వ్యక్తి మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాజాపూర్ గ్రామానికి చెందిన చింతి రెడ్డి లింగారెడ్డి (55) అనే వ్యక్తి కేశవపట్నం నుండి స్వగ్రామం రాజాపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, మార్గమధ్యలో మొలంగూర్ గ్రామంలోని ఓ కాలనీలోంచి వేగంగా వచ్చిన మరో బైకు అతని వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లింగారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అతన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ఘటనపై కేశవపట్నం ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

Next Story