వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని వ్వక్తి మృతి..

by Kodari Anjali |

వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని వ్వక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆకునూర్ గ్రామంలో జరిగింది.

వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని వ్వక్తి మృతి..
X

దిశ, సైదాపూర్: వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని వ్వక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకునూర్ గ్రామానికి చెందిన కొల్ల రాజిరెడ్డి (50) అనే వ్యక్తి సోమవారం ఆకునూర్ శివారులోని తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు రాజిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ, సైదాపూర్ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం మోకానిక్ గా పని చేసుకునేవాడని తెలిపారు. కాగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story