- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్
జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణనగర్‌కు చెందిన ఎర్రోజు సాయికిరణ్ పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో శ్రీరామ గోల్డ్ జువెలరీ వర్క్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని వద్ద పని చేస్తున్న పురానిపేటకు చెందిన ఇందూరి రాజమౌళి(51) ఫిర్యాదుదారుడి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అనంతరం డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజమౌళి తన మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసి సాయికిరణ్ పై పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సాయికిరణ్ అక్కడి నుంచి తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఫిర్యాదు మేరకు జగిత్యాల టౌన్ ఎస్సై ఎం.సుప్రియ హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఇందూరి రాజమౌళిని గురువారం జగిత్యాల పట్టణంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కాలేజ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ పి.కరుణాకర్ తెలిపారు.






