గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు

by Ratna Kumari |

గంజాయి మొక్క‌లు పెంచుతున్న వ్య‌క్తి అరెస్టు అయిన సంఘ‌ట‌న సుల్తానాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు
X

దిశ, సుల్తానాబాద్ : గంజాయి మొక్క‌లు పెంచుతున్న వ్య‌క్తి అరెస్టు అయిన సంఘ‌ట‌న సుల్తానాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్ర‌కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సుల్తానాబాద్ మండ‌లం ఆరేప‌ల్లి గ్రామ శివారులో ఉన్న సాయిరాం బ్రిక్స్ వ‌ద్ద ఓ వ్య‌క్తి గంజాయి మొక్క‌లు పెంచుతున్నాడ‌నే స‌మాచారం మేర‌కు ఎస్సై చంద్ర‌కుమార్ సిబ్బందితో క‌లిసి త‌నిఖీ చేశారు. గంజాయి మొక్క‌లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో గంజాయి మొక్క‌ల‌ను పెంచుతున్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుక‌ల్ప‌ర‌బోయి అనే వ్య‌క్తి ఐదు నెల‌ల క్రితం ప‌ని చేసేందుకు వ‌చ్చాడు. అయితే గంజాయి తాగే అల‌వాటు ఉండ‌టంతో త‌న వెంట తెచ్చుకున్న గంజాయి మొక్క‌ల‌ను స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు ఎస్సై చంద్ర‌కుమార్. స్వాధీనం చేసుకున్న 5 గంజాయి మొక్క‌ల విలువ దాదాపు రూ.50వేల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం.

Next Story