దశాబ్దాల తర్వాత స్వ‌స్థ‌లానికి వ‌చ్చిన మ‌ల్లోజుల

by Ratna Kumari |   (  Updated:2026-03-01 08:57:45  IST  )

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా పని చేసిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆదివారం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు.

దశాబ్దాల తర్వాత స్వ‌స్థ‌లానికి వ‌చ్చిన మ‌ల్లోజుల
X

దిశ, పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్ బ్యూరో మెంబర్ గా పని చేసిన మల్లోజుల వేణుగోపాల్ రావు ఆదివారం ఆయన స్వస్థలం పెద్దపల్లికి వచ్చారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఆయన గతేడాది అక్టోబర్ లో మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆయన లొంగుబాటు తర్వాత ఎప్పుడెప్పుడు ఇక్కడకు వస్తారా అని ఆయన బంధువులు వేచి చూస్తున్నారు. మల్లోజుల సోదరుడు అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడని విషయం తెలుసుకున్న ఆయన పెద్దపల్లిలోని సొంతింటి కి వచ్చాఠు. మల్లోజుల వేణుగోపాల్ రావు వచ్చిన విషయం తెలుసుకున్న బంధుమిత్రులు అక్కడికి వచ్చి ముచ్చటిస్తూ సంబరపడ్డారు. 2011 నవంబర్ లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మల్లోజుల సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు మృతి చెందాడు. అప్పటి నుండే మావోయిస్టు పార్టీలో ఏం జరిగిన వేణుగోపాల్ గురించి చర్చ జరిగేది. మల్లోజుల లొంగుబాటు తర్వాత కూడా మహారాష్ట్రలోని గడ్చిరోలికి పరిమితమయ్యాడు. ఆయన పర్యటన అంతా మహారాష్ట్ర పోలిసుల కనుసన్నల్లోనే జరుగుతుంది. మఫ్టీలో వచ్చిన పోలిసులు ప్రతిది సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే మల్లోజుల వేణుగోపాల్ రావు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Next Story