- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్
ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్
by Ratna Kumari |
ఈనెల 10న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్ పిలుపునిచ్చారు.

X
దిశ, మానకొండూరు : ఈనెల 10న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రమేష్ మాట్లాడుతూ.. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ ఇదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకు, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు దిశగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రధాని విచ్చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, మోడీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం కిరణ్, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మియాపురం లక్ష్మణ చారి, రాపాక ప్రవీణ్, శీలం కుమార్, బాషబోయిన ప్రదీప్ యాదవ్, మీసా రమణయ్య, పోచంపల్లి శ్రీనివాస్, ఎద్దులాపురం అశ్విన్ తేజ పాల్గొన్నారు.
Next Story






