- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నీరు మున్నీరవుతున్న మాదాపూర్
హత్యకు గురైన తన సోదరి ఇక లేదన్న నిజాన్ని ఆ అన్న మనసు అంగీకరించలేకపోతోంది. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దృశ్యం చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.

దిశ, కోరుట్ల రూరల్ : కాలం కరగని గాయం మిగిల్చింది. విధి ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హత్యకు గురైన తన సోదరి ఇక లేదన్న నిజాన్ని ఆ అన్న మనసు అంగీకరించలేకపోతోంది. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దృశ్యం చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.
సమాధి వద్దే నిరీక్షణ
యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితురాలైన గంధం వైష్ణవి మూడు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే తన ప్రాణ సమానమైన చెల్లి దూరమవ్వడాన్ని ఆమె సోదరుడు సంతోష్ తట్టుకోలేకపోతున్నాడు. గడిచిన మూడు రోజులుగా అతను వైష్ణవి సమాధి వద్దే గడుపుతున్నాడు. పూలతో సమాధి అలంకరణ: తన చెల్లికి ఇష్టమని రంగురంగుల పూలతో ఆమె సమాధిని అలంకరించాడు. వైష్ణవికి ఇష్టమైన పండ్లు, ఆహార పదార్థాలను సమాధి వద్ద ఉంచి, "చెల్లీ.. ఇవి తిను.. ఒక్కసారి లేవమ్మా" అంటూ బతిమాలుతున్న తీరు చూపరుల హృదయాలను పిండేస్తోంది. ఆమెను తలచుకుంటూ సంతోష్ పాడుతున్న పాటలు ఆ గ్రామంలో విషాద ఛాయలను నింపాయి. గుండె కోత అనుభవిస్తున్న కుటుంబం వైష్ణవి మరణంతో ఆ కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఊహించని ఈ ఘోరకలితో తల్లిదండ్రులు, బంధువులు విలవిలలాడుతున్నారు. ఒక వెలుగు వెలగాల్సిన ఆడబిడ్డ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం మాదాపూర్ గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన నిజంగా ఎంతో కలచివేసేలా ఉంది. సంతోష్, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.






