పాఠశాల టాయిలెట్లు తాళాలకే పరిమితం… విద్యార్థులు ఆరుబయటకే!

by Bhanu |

ఫోటోలో కనిపిస్తున్నది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల ప్రభుత్వ పాఠశాల. ఈ స్కూల్లో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలురు 260 మంది మిగతా 40 మంది బాలికలు ఉన్నారు.

పాఠశాల టాయిలెట్లు తాళాలకే పరిమితం… విద్యార్థులు ఆరుబయటకే!
X

దిశ, జగిత్యాల రూరల్ : ఈ ఫోటోలో కనిపిస్తున్నది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల ప్రభుత్వ పాఠశాల. ఈ స్కూల్లో మొత్తం 300 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలురు 260 మంది మిగతా 40 మంది బాలికలు ఉన్నారు. ఈ పాఠశాలలో బాయ్స్ టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటికి తాళం వేయడంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్తున్నారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేకపోవడం ఉన్న ఒక్క టాయిలెట్ లోకి చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చి వెళ్లేవారు ఉపయోగిస్తుండడంతో తాళం వేసినట్లు తెలుస్తుంది.


ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు సైతం అర్జంట్ అయితే బయటకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ పాఠశాల ఆవరణలో చేపట్టిన వంటగది నిర్మాణం బిల్లులు రాకపోవడం తో కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో కనీసం పిఈటీ కూడా లేకపోవడంతో పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారు. 14 మంది టీచర్లు ఉండాల్సిన బడిలో 9 మంది టీచర్లే ఉండడం స్కూల్ చుట్టూ కాంపౌండ్ లేకపోవడంతో అరకొర వసతుల తో నెట్టుకొస్తున్నారు.

Next Story