వేములవాడలో భవనంపై పడిన పిడుగు

by Elthuri vijay kumar |

వేములవాడ పట్టణంలో అకస్మాత్తుగా కురిసిన తేలికపాటి వర్షంతో పిడుగుపాటు చోటుచేసుకుంది.

వేములవాడలో భవనంపై పడిన పిడుగు
X

వేములవాడలో భవనంపై పడిన పిడుగు

- ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసం..

- భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలో అకస్మాత్తుగా కురిసిన తేలికపాటి వర్షంతో పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంత రావు నగర్ లోని ఓ భవనంపై పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు.

Next Story