- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితుల జోలికొస్తే చూస్తూ ఊరుకోం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల తో దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి నిరసన నిర్వహించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్ల తో దాడి చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడారు. బ్రాహ్మణులు చదివిన మంత్రాలకు అర్ధాలు దళిత బహుజనులకు తెలియదని మాట్లాడారే తప్ప ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా మాట్లాడలేదని, బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు ముఖ్యంగా బండి సంజయ్ మందుల సామేలు వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మనువాద గుండాలు మందుల సామేలు ఇంటి పై దాడి చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు. దళితుల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ ఇకనైనా వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న దళిత ప్రజా ప్రతినిధుల మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని కచ్చితంగా ప్రతిదాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. వెంటనే బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిచో దళిత సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యచరణ చేపట్టి కరీంనగర్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని.. కరీంనగర్ లో బండి సంజయ్ తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. మనువాద నాయకులు కావాలని దళిత నాయకులను టార్గెట్ చేసే విధంగా చర్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కాదాశి ప్రభాకర్, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, మీసాల సాయిలు, గజ్జల ఆనందరావు, తాండ్ర శంకర్ బాబు, వాసాల శ్రీనివాస రావణ్, కనకం విద్యాసాగర్, సముద్రాల లక్ష్మణ్, మనోహర్, ఎర్ర శ్రీనివాస్, గడపల విజయ్g కుమార్, తబలా అంజయ్య, ఆరేపల్లి ఓదేలు, శ్యామ్, భాస్కర్, కోండ్ర స్వరూప, భారతి పాల్గొన్నారు.






