- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహనీయుల జయంతి ఉత్సవాలను అద్భుతంగా జరుపుకుందాం
ఏప్రిల్ 05న మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కరీంనగర్ అత్యంత వైభవంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్య, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ఏప్రిల్ 05న మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కరీంనగర్ అత్యంత వైభవంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్య, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి మహనీయుల జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.మహనీయుల విగ్రహాల వద్ద అధికారులు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ఉంటూ రోల్ మోడల్ గా నిలిచేలా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఏప్రిల్ 2న జరిగే గ్రామసభల్లో మహనీయుల జయంతి ఉత్సవాల విజయవంతం కోసం ప్రజలకు వివరించాలన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ మహానీయుల ఉత్సవాలను ఘనంగా జరుపుకునే మంచి అవకాశం లభించిందని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలల్లో మహనీయుల జీవిత చరిత్రపై క్విజ్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా వారి జీవిత చరిత్ర పై వీడియోలు ప్రదర్శిస్తామన్నారు. గ్రామాలు పట్టణాల్లో మహనీయుల విగ్రహాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతామన్నారు. దళితుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ హుజురాబాద్ ఆర్టీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి, ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వై తిరుపతిరావు అధికారులు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






