- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు నాగయ్య ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి
by velandi.Saikiran |
జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని KTR

X
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు అందుబాటులో ఉండాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నర్మాల వద్ద మానేరువాగులో గల్లంతయిన నాగయ్య ఆచూకీకి రెస్క్యూ చర్యలు ముమ్మరం చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే వరదలో చిక్కుకున్న మిగతా రైతులను ఒడ్డుకు చేర్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
- Tags
- KTR
- heavy rains
Next Story






