- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్‌గా కొండల్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యాయపోరాటంలో విజయం సాధించిన హైకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల మేరకు హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్‌గా ఎడవల్లి కొండల్ రెడ్డి మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : న్యాయపోరాటంలో విజయం సాధించిన హైకోర్టు వెలువరించిన కీలక ఆదేశాల మేరకు హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్‌గా ఎడవల్లి కొండల్ రెడ్డి మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ పాత పాలక వర్గాన్నే కొనసాగించాలని కోర్టు స్పష్టం చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. మంగళవారం బ్యాంకు కార్యాలయానికి చేరుకున్న కొండల్ రెడ్డికి డైరెక్టర్లు, అనుచరులు, రైతులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులు (డైరెక్టర్లు) కూడా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
గతంలో పాలకవర్గం రద్దు పై వివాదం నెలకొనగా, పాత పాలకవర్గానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం, బ్యాంకు అభివృద్ధి కోసం తమ పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ పరిణామం స్థానిక సహకార రంగ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తమపై నమ్మకంతో తీర్పునిచ్చిన న్యాయస్థానానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






