- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండంత పండుగకు కొండగట్టు సిద్ధం...రేపటి నుండి జయంతి ఉత్సవాలు
కొండంత పండుగకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబయింది. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దిశ, కొండగట్టు : కొండంత పండుగకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబయింది. కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల్లో నుండి లక్షలాదిగా అంజన్న దీక్షపరులు, భక్తులు కాలినడకన, వివిధ మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకోనున్నారు. కొండగట్టులో జరిగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇప్పటికీ పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటూ న్నారు.భక్తుల కోసం సుమారు నాలుగున్నర లక్షల లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
పోలీస్ పహారాలో కొండగట్టు
ఈ ఉత్సవాలకు సుమారు తొమ్మిది వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.అలాగే కొండగట్టు ఆలయ పరిసరాలతో పాటు దిగువ కొండగట్టు ప్రాంతము తో కలిపి సుమారు నూట ముప్పయి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించునున్నట్లు మల్యాల సిఐ నీలం రవి తెలిపారు.
రేపటి నుండి ఆర్జిత సేవలు రద్దు
మంగళవారం నుండి గురువారం వరకు అంజన్న సన్నిధిలో ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు ఈనెల 20 నుండి 22 వరకు జయంతి ఉత్సవాలు జరగనుండగా ఆర్జిత సేవలు వాహన పూజలు,అభిషేకాలు,సత్యనారాయణ వ్రతాలు తదితర పూజలు నిలిపివేశామని భక్తులు సహకరించాలని కోరారు. 24 వ తారీకు నుండి యధావిధిగా స్వామి వారి సేవలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.






