కొమిరెడ్డి సేవలు మరువలేనివి : మంత్రి అడ్లూరి

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని విధిత్ రెడ్డి గార్డెన్ లో బుధవారం కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

కొమిరెడ్డి సేవలు మరువలేనివి :  మంత్రి అడ్లూరి
X

దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని విధిత్ రెడ్డి గార్డెన్ లో బుధవారం కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ‌ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంత ప్రజలకు రాములు అందించిన సేవలు మరువలేని అని అన్నారు.


ప్రజల గుండెల్లో చిరాస్థాయిగా నిలిచిపోయే విధంగా కొమిరెడ్డి రాములు, జ్యోతక్క విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాములు కుటుంబ సభ్యులు సూచించిన చోట వచ్చే జయంతి లోపు విగ్రహాల ఏర్పాటు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తో పాటు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సింగరావు పర్యవేక్షణ లో విగ్రహ ఏర్పాట్ల పనులు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజమ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్యతో పాటు కోరుట్ల నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story