- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేశవపట్నంలో చోరీ.. పనికి వెళ్లొచ్చేసరికి ఇళ్లు గుల్ల..
శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని,ఎస్సీ బీసీ కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం దొంగలు పడ్డారు. బాధితుని కథనం ప్రకారం మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన మేకల పరమేశ్ అను వ్యక్తి సెంట్రింగ్ పనుల కు ఉదయం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం సైదాపూర్ కు వెళ్లినట్లు తెలిపారు.

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని,ఎస్సీ బీసీ కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం దొంగలు పడ్డారు. బాధితుని కథనం ప్రకారం మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన మేకల పరమేశ్ అను వ్యక్తి సెంట్రింగ్ పనుల కు ఉదయం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం సైదాపూర్ కు వెళ్లినట్లు తెలిపారు. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోని ఇంటి తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించగా వెనక ద్వారా తెరిచి ఉండడంతో అవాక్కయ్యాడు. బీరువాలోని బట్టలు, కాగితాలు చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ధాన్యం ,అమ్మగా వచ్చిన రూపాయలు 85000 బీరువాలో భద్రపరుచుకున్నట్లు తెలిపాడు. బీరువాకు తాళం లేదని దీనితో దొంగలకు పని సులువుగా మారిందని అన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తన ఇంట్లో దొంగతనం జరిగిందని మళ్లీ సోమవారం దొంగలు దొంగతనానికి తెగబడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.సమాచారం అందుకున్న ట్రైని ఎస్సై సుమన్ రెడ్డి క్లూస్ టీం సహాయముతో వేలి ముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపాడు.






