ఏసీబీ దాడిలో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ

by Ratna Kumari |   (  Updated:2026-03-18 11:38:40  IST  )

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ రైడ్ లో కరీంనగర్ లో అర్బన్ ఎక్సైజ్ సీఐ గా పని చేస్తున్న రామును అరెస్టు చేశారు.

ఏసీబీ దాడిలో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ రైడ్ లో కరీంనగర్ లో అర్బన్ ఎక్సైజ్ సీఐ గా పని చేస్తున్న రామును అరెస్టు చేశారు. ఏసీబీ అధికారి పున్నం చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండేటి రాము 2019 నుంచి 2024 వరకు వేములవాడలో పని చేస్తున్న సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి వద్ద నుంచి లంచాలు తీసుకునేవాడు. ఇదే క్ర‌మంలో స్కూల్ టీచ‌ర్ గా ప‌ని చేసే త‌న ఫ్రెండ్ జ‌క్క‌ని వేణు స‌హాయంతో వ్యాపారుల వ‌ద్ద నుంచి లంచాలు తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ విష‌యం ప‌ట్ల గుర్తు తెలియని వ్యక్తి ఎక్సైజ్ డీజీ కి పిటిషన్ ఇవ్వడంతో విచారించగా.. వాస్త‌వం అని నిర్ధారణ అయింది. దీంతో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు గుండేటి రాము, అతని స్నేహితుడు వేణు ను హౌస్ అరెస్ట్ చేశారు. రాము ఇంట్లో సోదాలు చేప‌ట్టారు. రూ.20 లక్షల నగదు ల‌భించింద‌ని తెలిపారు. దొరికిన నగదు ఎక్కడిది అని ప్ర‌శ్నించ‌గా.. రాము సమాధానం చెప్పకపోవడంతో నగదును సీజ్ చేసి రాముని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వెల్ల‌డించారు.

Next Story