- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈదురుగాలుల బీభత్సం.. నేలేరాలిన మామిడి కాయలు
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలో ఆదివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలో ఆదివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జగ్గయ్యపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 20 ఎకరాల్లో మామిడి తోటలు నేలకొరిగాయి. బాధితుల్లో జగ్గయ్యపల్లికి చెందిన వ్యాట వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి (మూడు ఎకరాలు), శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి (ఐదు ఎకరాలు) ఉన్నారు. వీరే కాకుండా మండల కేంద్రంలోని మరో పది ఎకరాల్లోని మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి.
అరుగాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మామిడి పంట, కాయలు చేతికి వచ్చే సమయానికి ఒక్కసారిగా ఈదురుగాలుల ధాటికి నేలపాలవ్వడంతో రైతులు తీవ్రంగా కుమిలిపోతున్నారు. పూత దశ నుంచి కాయలు కాసే వరకు ఎన్నో కష్టాలు పడి పెంచిన ఈ పంట ఇప్పుడు పూర్తిగా నష్టపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నష్టంతో కోలుకోలేని దెబ్బతిన్న మామిడి రైతులను ఆదుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.






