- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ జిల్లా మహిళకు అరుదైన అవకాశం
కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ కు చెందిన స్వశక్తి మహిళా దయ్యాల హరిత శ్యామ్ యాదవ్ న్యూ ఢిల్లీలోని భారత మండపంలో ఈ నెల 13న నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫర్మేషన్ (అమృత్ పథకం) అమృత్ మిత్రా మహోత్సవంలో పాల్గొ న్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ కు చెందిన స్వశక్తి మహిళా దయ్యాల హరిత శ్యామ్ యాదవ్ న్యూ ఢిల్లీలోని భారత మండపంలో ఈ నెల 13న నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్ పథకం) అమృత్ మిత్రా మహోత్సవంలో పాల్గొ న్నారు. 63వ డివిజన్లోని శ్రీ చైతన్య సభ్యురాలు హరిత అమృత్ మిత్రగా ఎంపికైంది. కొంతకాలంగా జ్యోతి నగర్ లోని వాటర్ ట్యాంక్ మెంటనెన్స్ విభాగంలో పని చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అమృత్ మిత్రలు పాల్గొనగా, తెలంగాణలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ఐదుగురు స్వశక్తి సంఘాలకు చెందిన అమృత్ మిత్రలను నామినేట్ చేయగా, అందులో కరీంనగర్ టౌన్ కు చెందిన హరిత శ్యామ్ కు అవకాశం లభించడం విశేషం. అమృత్ మిత్ర మహోత్సవంలో ఐదు కార్పొరేషన్ల నుంచి బి. అనిత (శ్రీసరస్వతి ఎస్ఏహెచ్, రామగుండం), హరిత (శ్రీ చైతన్య ఎసోచ్, కరీంనగర్), చిట్టెమ్మ (మయూరిక మహిళా సంఘం, మహబూబ్నగర్), ఎల్.ఝాన్సీ రాణి (లయ ఎస్ఏహెచ్, ఖమ్మం), చిట్యాల శ్రీలత (మేరీమాత పొదుపు సంఘం, జీడబ్ల్యూఎంసీ) పాల్గొన్నారు.
తొలిసారి ఫ్లైట్ ప్రయాణం
అమృత్ పథకం కింద వివిధ పనులు నిర్వహిస్తున్న ఈ ఐదుగురు మహిళలు తొలిసారిగా విమానంలోషావుల్ మండపం, హెర్వ్ డెత్ అమృత్ మిత్ర మహోత్సవంలో అమృత్ మిత్రలు ఢిల్లీకి వెళ్లి తిరిగి హైదరాబాద్ కు రావడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతిగా పేర్కొ న్నారు. కలలో కూడా ఊహించని విధంగా విమాన ప్రయాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.తన సేవలను గుర్తించి ఢిల్లీకి వెళ్లే అవకాశం కల్పించిన శ్రీ చైతన్య పొదుపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి & సీఈఓ మంజుల, మేయర్, మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






