- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ మెట్ పల్లి పట్టణ అధ్యక్ష పదవీకి జెట్టి లింగం రాజీనామా చేయాలి
కాంగ్రెస్ మెట్ పల్లి పట్టణ అధ్యక్ష పదవీకి జెట్టి లింగం రాజీనామా చేయాలని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

దిశ, మెట్ పల్లి : కాంగ్రెస్ మెట్ పల్లి పట్టణ అధ్యక్ష పదవీకి జెట్టి లింగం రాజీనామా చేయాలని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగంతో పాటు పలువురు చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. జెట్టిలింగంకు దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. గతంలో కౌన్సిలర్ గా గెలిచి టిఆర్ఎస్ పార్టీ వారికి మద్దతు తెలిపారని.. దాని ద్వారా కౌన్సిల్ సభ్యత్వం కోల్పోయారని గుర్తు చేశారు. మరో రెండుసార్లు మున్సిపల్ కౌన్సిల్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వగా ప్రజల మద్దతు లేక ఓడిపోయారని తెలిపారు. నాయకత్వం లోపం అంటూ ఆరోపణ చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉన్నత పదవులు ఇచ్చిందని.. పదవులను అనుభవించి ఇప్పుడు ఆరోపించడం సరికాదన్నారు. నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు నాయకత్వం బలంగా ఉందని.. కోరుట్ల, మెట్ పల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్స్ బత్తుల నరేష్, పందిరి రమేష్, నునుగొండ నరేష్, అజీమ్, మాసుల ప్రవీణ్, మహేష్, గుడి కందుల అజయ్, ముఖిమ్, మాధవరెడ్డి, రయిస్, గజం రవి పాల్గొన్నారు.






